కార్తి మరియు హన్సిక ఈ మధ్య హైదరాబాద్లో తమ తాజా తమిళ్ చిత్రం ‘బిర్యాని’ ముఖ్య షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకుడు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ చెన్నైలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం, ప్రధాన తారాగణం యొక్క కొన్ని ముఖ్య సన్నివేశాల కోసం హైదరాబాద్ వచ్చారు. సినిమా సాంతం ఎంటర్టైనర్ గా సాగుతుంది. ఒక రాత్రి బిర్యానీ కోసం వెతికే హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతాది అనేది కధ. కార్తి సరసన హన్సిక నటించడం ఇదే మొదటిసారి. ప్రేమ్ జీ అమరెన్, మాండీ తహ్కర్ ప్రధాన పాత్రధారులు. కార్తి నటించిన ‘బ్యాడ్ బాయ్’ పరాజయం పాలైనా ఇప్పుడు అతని కొత్త సినిమాలు ‘బిర్యాని’, ‘ఆల్ అజాఘు రాజా’ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్నాయి.