పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినా లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. దర్శకుడు జ్యోతికృష్ణ అహర్నిశలు కస్టపడి తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇపుడు సిద్ధం అవుతుంది. అయితే ఈ ఈవెంట్ కి ప్రముఖ కర్ణాటక మినిస్టర్ హాజరవుతున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
చిత్ర యూనిట్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన అడవులు, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే వస్తున్నట్టుగా ఆహ్వానం పలికారు. నిర్మాత ఏ ఎం రత్నం సహా ఇతర ముఖ్యులు మినిస్టర్ కి ఆహ్వానం పలుకుతూ కనిపించిన పిక్ తో ఈ వార్త కన్ఫర్మ్ చేశారు. ఇక హరిహర వీరమల్లు ఈవెంట్ ఈ జూలై 21 సాయంత్రం నుంచి హైదరాబాద్ శిల్ప కళావేదికలో చేయనున్న సంగతి తెలిసిందే. అలాగే సినిమా జూలై 24న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.