హిందీలోకి డబ్ అయ్యే సౌత్ ఇండియన్ సినిమాలు చూస్తాను – కపిల్ దేవ్

KapilDev
నూతన తారలు రోహిత్ రెడ్డి, రాజ్ అర్జున్, కృతిక, నేష్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన తుమ్మ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘దిల్ దివానా’. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకి సీనియర్ క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఆడియో వేడుకకంటే ముందు కపిల్ దేవ్,ఈ చిత్ర టీం ఓ ప్రెస్ మీట్ పెట్టి తమ అనడాన్ని పంచుకున్నారు.

కపిల్ దేవ్ మాట్లాడుతూ ‘ నేను ఇప్పటి వరకూ ఏ సినిమా ఈవెంట్స్ లేదా ప్రమోషన్స్ కి కానీ హాజరు కాలేదు. ఇదే మొదటిది. మాములుగా సినిమా వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ ని బాగా ప్రోత్సహిస్తుంటారు. అలాగే క్రికెట్ ప్లేయర్స్ కూడా సినిమా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ ఈవెంట్ కి హాజరయ్యాను. ఈ సినిమాకి పనిచేసిన ఐదుగురు యంగ్ పీపుల్స్ కి అల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే మీడియా వారు ఈ రోజు మిమ్మల్ని ప్రమోట్ చెయ్యడానికి వచ్చారు. రేపు మీరు పెద్ద స్టార్స్ అయినప్పుడు వాళ్ళని మరచిపోకూడదు. నేను హిందీలోకి డబ్ అయ్యే సౌత్ ఇండియన్ సినిమాలు చూస్తుంటాను. డబ్ సినిమాలైనప్పటికీ బాగుంటాయి. ఇక్కడి సినిమాల సినిమాటోగ్రఫీ బాగుంటుందని’ అన్నారు.

అలాగే సచిన్ కి భారతరత్న వచ్చిన విషయంపై మీ కామెంట్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ ఒక స్పోర్ట్స్ మాన్ గా ఒక క్రికెట్ ప్లేయర్ కి భారతరత్న వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. నేను ఓ స్పోర్ట్స్ మాన్ కి భారతరత్న వస్తుందని ఎన్నడూ ఊహించలేదని’ కపిల్ దేవ్ అన్నారు.

Exit mobile version