నేషనల్ అవార్డు గ్రహీత, కన్నడ నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ పాన్-ఇండియా ఫాంటసీ డ్రామా “కాంతారా చాప్టర్ 1” దసరా కానుకగా గ్రాండ్ రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ మూవీ సాలిడ్ వసూళ్లను రాబడుతోంది.
ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ దూకుడు చూపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర $1.5 మిలియన్ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే $2 మిలియన్ క్లబ్లోకి అడుగుపెట్టేందుకు ఈ మూవీ రెడీ అవుతోంది. నార్త్ అమెరికాలో యష్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా కాంతార చాప్టర్ 1 నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటింగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేశారు.