ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్

Kantara-Chapter-1

కన్నడలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది.

థియేటర్లలో సాలిడ్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే, ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నప్పటికీ, ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ క్రేజ్‌తో దూసుకుపోతుంది.

బుక్ మై షోలో ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 14 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. రోజుకు యావరేజ్‌గా 70వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version