ఇంగ్లీష్ లో ‘కాంతార 1’.. ఏ ఓటిటిలో చూడొచ్చంటే!

Kantara Chapter 1

ఈ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి నటించిన తెరకెక్కించిన ఈ డివోషనల్ సినిమా ఓటిటిలోకి వచ్చాక కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇలా మొదట అమెజాన్ ప్రైమ్ వీడియోలో దక్షిణాది భాషలు కన్నడ, తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఇక ఈ తర్వాత మళ్ళీ నెల వ్యవధికి అదే ప్రైమ్ వీడియోలో హిందీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కాంతార ఇంగ్లీష్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. గతంలో వచ్చిన సినిమాని నెట్ ఫ్లిక్స్ ఇంగ్లీష్ లోకి తీసుకొస్తే ఈసారి చాప్టర్ 1 ని వారికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రైమ్ వీడియో వారే తీసుకొచ్చారు. ఇలా లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అన్ని భాషలు ప్రైమ్ వీడియోనే అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ప్రైమ్ వీడియోలో ట్రై చేయొచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version