‘ది ప్యారడైజ్’లో కన్నప్ప నటుడు కన్ఫర్మ్!

‘ది ప్యారడైజ్’లో కన్నప్ప నటుడు కన్ఫర్మ్!

Published on Jun 27, 2025 8:04 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే కన్నప్ప. మరి ఈ సినిమాలో గ్రాండ్ తారాగణం కనిపిస్తుండగా సినిమా విడుదల సందర్భంగా అనేకమంది సినీ ప్రముఖులు కూడా చిత్ర యూనిట్ కి తమ బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే నాచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో చేస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్ కోసం అందరికీ తెలిసిందే.

మరి ఈ సినిమాలో కన్నప్ప నటుడు మంచు మోహన్ బాబు కూడా ఉన్నారని ఆ మధ్య టాక్ ఉంది. ఇక లేటెస్ట్ గా శ్రీకాంత్ ఓదెల నుంచి మోహన్ బాబుపై స్పెషల్ మెన్షన్ చేసి పెట్టడం అనేది ఆసక్తిగా మారింది. దీనితో ప్యారడైజ్ లో మోహన్ బాబు ఉన్నట్టు మరోసారి కన్ఫర్మ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు