ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ జయలలిత జీవితం ఆధారంగా రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా కంగనా మాట్లాడుతూ.. ‘‘జయలలితగారు అందం, జనాకర్షణ కలిగిన గొప్ప వ్యక్తి మరియు గొప్ప నటి. ఆవిడ ఆవిడ్ని బాగా నమ్మారు. అందువల్లే ఆమె రాజకీయాల్లో విజయం సాధించారు. అలాంటి గొప్ప నాయకురాలి పాత్రలో అచ్చం ఆమెలా నటించడం నాకు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే, నేను ఆమెంత అందగత్తెను కాదు. అయితే మా ఇద్దరి విషయంలో ఓ పోలిక ఉంది. అదేమిటంటే.. మేమిరువురం సినిమా రంగంలోకి ప్రవేశించడానికి మొదట్లో కాస్త సంకోచించాము; అని తెలిపింది కంగనా.
కాగా ఎంజీఆర్ పాత్రలో సీనియర్ నటుడు అరవింద్‌స్వామి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది.