బాలీవుడ్ ప్రముఖులకి కమల్ స్పెషల్ షో

బాలీవుడ్ ప్రముఖులకి కమల్ స్పెషల్ షో

Published on Feb 2, 2013 5:15 PM IST

Vishwaroopam-Premiere-(5)

కమల్ హాసన్ హీరో కం డైరెక్టర్ గా తెరకెక్కించిన ‘విశ్వరూపం’ సినిమా తమిళ వెర్షన్ రిలీజ్ కోసం ఇంకా ఫైట్ జరుగుతోంది. ఇదిలా ఉండగా హిందీ వెర్షన్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ ప్రెస్ తో మాట్లాడుతూ బాలీవుడ్ మీడియా ఈ సినిమాని ఇంతలా ప్రమోట్ చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు.

అలాగే కమల్ బాలీవుడ్ ప్రముఖుల కోసం స్పెషల్ షో కూడా ఏర్పాటు చేసారు. ఈ షోకి సల్మాన్ ఖాన్, రేఖ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తిలకించారు. వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించారని నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ తో పాటు శేఖర్ కపూర్, ఆండ్రియా జెరేమియా, పూజా కుమార్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు.

తాజా వార్తలు