ఆ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ అయ్యేది అప్పుడేనట

ఆ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ అయ్యేది అప్పుడేనట

Published on Nov 5, 2020 11:14 PM IST

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ తన తర్వాతి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. ‘ఖైదీ’ చిత్రంతో మెప్పించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఎందుకంటే లోకేష్ కానగరాజ్ ప్రస్తుతం విజయ్ హీరోగా ‘మాస్టర్’ చిత్రాన్ని చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. విజయ్ తర్వాత కమల్ హాసన్ సినిమా కావడం మూలాన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

నవంబర్ 7న కమల్ పుట్టినరోజు కావడంతో ఆరోజున టైటిల్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఆరోజు సాయంత్రం 5 గంటలకు టీజర్ విడుదలవుతుంది. కొన్నిరోజులుగా ఈ సినిమాకు ‘గురు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ పేరునే ఫైనల్ చేస్తారో లేకపోతే వేరొక పేరును రివీల్ చేసి సప్రైజ్ ఇస్తారో చూడాలి. కమల్ సొంత బ్యానర్లో నిర్మితంకానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

తాజా వార్తలు