రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!

kamal haasan

రీసెంట్ గా సోషల్ మీడియాని షేక్ చేసిన క్రేజీ బజ్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల భారీ మల్టీస్టారర్ కోసం అని చెప్పాలి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కమల్ తో విక్రమ్, రజినీకాంత్ తో కూలీ సినిమాలు చేసాడు. కానీ ఈ ఇద్దరినీ కలిపి ఓ సినిమా చేస్తున్నట్టుగా వచ్చిన టాక్ కేజ్రీగా మారింది.

మరి దీనిపై ఫైనల్ గా కమల్ హాసన్ ఓపెన్ అవ్వడం అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. దీనితో కమల్ హాసన్ ఓ ఈవెంట్ లో పాల్గొనగా తమ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ఎప్పుడో పడాల్సింది అని కానీ ఇప్పుడు తాము కలిసి వస్తున్నాం, బిజినెస్ పరంగా కూడా మా కాంబినేషన్ సర్ప్రైజ్ చేస్తుంది అన్నట్టు తెలిపారు. దీనితో ఈ భారీ కాంబినేషన్ పై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి.

Exit mobile version