కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్ వాయిదా వేసిన కమల్ హాసన్

కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్ వాయిదా వేసిన కమల్ హాసన్

Published on Jun 3, 2025 7:00 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ మరో రెండు రోజుల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ చేసిన కొన్ని కామెంట్స్ కన్నడ ప్రజల్లో కొత్త వివాదానికి దారి తీసింది. కన్నడ భాషను కించపరిచేలా కమల్ మాట్లాడాడని.. ఆయన ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే థగ్ లైఫ్ చిత్రాన్ని బ్యాన్ చేస్తామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ తెలిపింది.

దీంతో కమల్ ఇప్పుడు ఈ చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కర్ణాటక ఫిలిం ఛాంబర్‌తో తదుపరి చర్చలు జరిపే వరకు తన సినిమాను కన్నడలో రిలీజ్ చేయడం లేదని కమల్ తేల్చి చెప్పాడు. దీంతో థగ్ లైఫ్ మూవీ ఇంకా ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు