కమల్ కొత్త విశ్వరూపంలో కొత్త మార్పులు

కమల్ కొత్త విశ్వరూపంలో కొత్త మార్పులు

Published on Jun 17, 2013 8:30 PM IST

Vishwaroopam
యూనివర్సల్ హీరో కమల్ ఎంతో కష్టపడి తన కలల ప్రాజెక్ట్ అయిన ‘విశ్వరూపం’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా వివాదాలకి కేంద్ర బిందువుగా నిలిచింది. అయినా సరే పట్టుదల వదలని కమల్ దానికి సీక్వెల్ ను ‘విశ్వరూపం -2’ పేరుతో తీస్తున్నాడు. ఈ కధ ఇండియా టెర్రరిజం నేపధ్యంలో సాగనుంది. కాకపోతే ఈ సినిమా సాంకేతిక బృందంలో కొన్ని మార్పులు చేసారు. తోలి భాగానికి సానూ నర్గిస్ ఛాయాగ్రహకుడిగా పనిచేస్తే ఇప్పుడు ఈ సీక్వెల్ కు ఆయన అందుబాటులోలేక శామ్ దత్ ను ఎంపికచేసుకున్నారు. ఈయన తెలుగులో ‘ప్రస్థానం’, ‘సాహసం’ లాంటి సినిమాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేసారు. అలాగే క్రితంసారి సంగీతం అందించిన శంకర్ – ఎసాన్- లాయ్ స్థానంలో గిర్బన్ అనే సంగీత దర్శకుని తీసుకున్నారు . ఈ సినిమా ఆగష్టులో విడుదలకుసిద్ధమవుతింది.

తాజా వార్తలు