‘బాద్షా’ లో జనాకిగా కనిపించనున్న కాజల్

Kajal
సినీ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ ఒక పాపులర్ హీరోయిన్, తను నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం తన రాబోవు సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న ‘బాద్షా’. ఈ సినిమాలో తను పాత్ర కామెడీగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో కాజల్ జానకిగా కనిపించనుంది. తన గ్లామర్ ఈ సినిమాకి మేజర్ అసెట్ గా నిలువనుందని సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మించాడు, థమన్ సంగీతాన్ని అందించాడు. ‘బాద్షా’ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ లో మంచి టాక్ సంపాదించుకుంది.

Exit mobile version