అందాల భామ కాజల్ ఈ సంవత్సరంలో పలు భారీ ప్రాజెక్టులు చేయబోతుంది. తెలుగులో ఎన్టీఅర్ సరసన శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో, పవన్ కళ్యాణ్ సరసన పూరి జగన్నాధ్ డైరెక్షన్లో, రామ్ చరణ్ సరసన వివి వినాయక డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనుంది. ఇవే కాకుండా సూర్య సరసన ‘మాట్రాన్’ చిత్రంలో, విజయ్ సరసన ‘తుపాకీ చిత్రంలో నటించనుంది. ఇవే కాకుండా తాజా సమాచారం ప్రకారం ఆమె ఒక హిందీ చిత్రంలో నటించబోతుంది. అజయ్ దేవగన్ సరసన ‘సింగం’ చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన కాజల్ అక్షయ్ కుమార్ సరసన ఒక థ్రిల్లర్ చిత్రంలో నటించబోతుంది. గతంలో ఎ వెడ్నస్ డే వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.