ఆచార్యను కాజల్ వదిలేసినట్టేనా?

ఆచార్యను కాజల్ వదిలేసినట్టేనా?

Published on May 2, 2020 12:24 PM IST

ఆచార్య మూవీపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారు . అనివార్య కారణాలవల్ల త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ ను ఆమె స్థానంలో తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కాజల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది.

అందుకు కారణం ఆచార్య కోసం కాజల్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అని సమాచారం అందుతుంది. తమిళ్ లో కాజల్ ఒక సినిమాకు సైన్ చేయగా ఆ మూవీ డేట్స్ ఆచార్య డేట్స్ కరోనా లాక్ డౌన్ కారణంగా అడ్జస్ట్ కానీ పరిస్థితి ఏర్పడిందట. దీనితో కాజల్ ఈ ప్రాజెక్ట్ నుండి దాదాపు తప్పుకున్నట్లే అని గట్టిగా వినిపిస్తుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు