షూటింగ్ ముగియడమే ఆలస్యం ముంబై చెక్కేసిన కాజల్

షూటింగ్ ముగియడమే ఆలస్యం ముంబై చెక్కేసిన కాజల్

Published on Dec 23, 2020 1:30 AM IST

కాజల్ అగర్వాల్ పెళ్లి తరవాత ఈమధ్యనే సినిమా చిత్రీకరణల్లో పాల్గొనడం సార్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘ఆచార్య’ షూటింగ్లో జాయిన్ అయింది. సెట్లో భర్త గౌతమ్ కిచ్లుతో అడుగుపెట్టి చిరు ఆశీస్సులు తీసుకుంది. సుమారు పది రోజులపాటు జరిగిన షూటింగ్లో కాజల్, చిరుల మీద పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు కొరటాల శివ. ఇక ఆమె తాలూకు సన్నివేశాలు వచ్చే షెడ్యూల్లోనే ఉంటాయి.

అందుకే కాజల్ ప్యాకప్ చెప్పగానే భర్తను కలిసేందుకు ముంబై ఫ్లయిట్ ఎక్కేసింది. మళ్ళీ ఆమె జనవరి నుండి షూటింగ్లో పాల్గొననుంది. ప్రస్తుతం కాజల్ చేతిలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇండియన్ 2’ కూడ ఉంది. పెళ్లి తరవాత ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. మరి కొత్త ఏడాదిలో ఏమైనా ఒప్పుకుంటుందేమో చూడాలి. ఇకపోతే ఈ చందమామ తన భర్తతో కలిసి హోమ్ డెకార్ బిజినెస్ మొదలుపెట్టింది. త్వరలోనే ‘కిచ్డ్’ పేరుతో ప్రోడక్ట్స్ లాంచ్ చేయనుంది.

తాజా వార్తలు