జీవీ చిత్రంలో కాజల్.?

kajal-aggarwal
కొంతకాలంగా కనుమరుగైన కాజల్ కి ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం రాంచరణ్,క్రిష్ణవంశీల చిత్రంలో కాజల్ నటిస్తోంది.ఇది కాక తనకు తెలుగులో ఏ సినిమా లేనప్పటికీ తమిళంలో మాత్రం మంచి అవకాశాలే వస్తున్నాయి.

ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం జీవీ నటించే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు కాజల్ ను సంప్రదిన్చినట్టు తెలుస్తోంది. అర్.బి,చౌదరి ఈ జంటను తొలిసారిగా తెర మీద చూపించాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది.చంద్రమోహన్ యీ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.అంతా సవ్యంగా జరిగితే ఈ చిత్రం జూన్ నెలలో సెట్స్ మీదకు వెళ్తుంది.

ఇది కాకుండా ధనుష్ హీరో గా నటించే మరో చిత్రం లో కూడా కాజల్ హీరోయిన్ గా కనిపించబోతుంది.లవ్ ఫెయిల్యూర్ చిత్ర దర్శకుడు బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.

Exit mobile version