ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియం నందు హీరోయిన్ కాజల్ మైనపు విగ్రహాన్ని నేడు లాంచ్ చేశారు. సింగపూర్ నందు గల ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తన మైనపు విగ్రహం పక్కన ఫోజిస్తూ నవ్వులు చిందించి కాజల్. టాలీవుడ్ నుండి ఈ అర్హత సాధించిన హీరోయిన్ గా కాజల్ గుర్తింపు పొందింది. ఇక తెలుగు హీరోలలో ప్రభాస్, మహేష్ ఈ అర్హత సాధించారు. బాలీవుడ్ నుండి అమితాబ్, హ్రితిక్, కాజోల్, ఐశ్వర్యా రాయ్, షారుక్,కరీనా కపూర్, అనిల్ కపూర్ ఇలా చాలా మంది సెలెబ్రిటీల మైనపు విగ్రహాలు ఈ మ్యూజియం నందు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక ప్రస్తుతం కాజల్ తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో చేస్తున్న భారతీయుడు 2 సినిమాలో ప్రధాన హీరోయిన్ గా చేస్తున్నారు. గత ఏడాది రణరంగం, సీతా వంటి చిత్రాలలో కనిపించిన కాజల్ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.