స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ముంబైలోని ఒక స్టార్ హోటల్లో గౌతమ్ కిచ్లూని పెళ్లాడింది కాజల్. వివాహం అనంతరం మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ కు వెళ్లి ఆ ట్రిప్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ సందడి చేసిన కాజల్ ట్రిప్ ముగించుకుని ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఇంట్లో చిన్నపాటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
అవి కూడ పూర్తైపోతే ఎప్పటిలాగే తన ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేయనుంది ఈ చందమామ. తాజా ఇన్ఫో మేరకు డిసెంబర్ 5 నుండి కాజల్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఈలోపు చిరు కూడ సెట్స్ మీదకు వచ్చేస్తారు. నవంబర్ 20 నుండి ఆయనపై సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది. పెళ్లి తరవాత కాజల్ షూటింగ్ చేస్తున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ఇది కాకుండా కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’లో కాజల్ కథానాయకిగా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం కూడ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.