స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహమాడిన విషయం తెలిసిందే. హనీమూన్ వెళ్లి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచుతూ తెగ హడావిడివి చేసిన కాజల్ ఇప్పుడు ఎంజాయ్ చేసే మూడ్ నుండి బయటికొచ్చేసి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఆమె త్వరలో కొత్త బిజినెస్ కూడ మొదలుపెట్టనుంది. అదే హోమ్ డెకార్ బిజినెస్.
కాజల్ భర్త గౌతమ్ ఎలాగూ ఇంటీరియర్ డిజైనర్. అందుకే అతనితో కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది ఆమె. ఈ హోమ్ డెకార్ బ్రాండ్ కు తన పేరు, భర్త పేరు కలిసొచ్చేలా కిచ్డ్ అనే పేరును నిర్ణయించింది. ఇందులో ఇంటికి కావాల్సిన అన్ని రకాల ఇంటీరియర్ డిజైనింగ్ స్టఫ్ దొరుకుతుంది. ‘మా ఇద్దరి ప్రేమ నుంచి ఈ బ్రాండ్ పుట్టింది. ముందుగా ఫెస్టివ్ థీమ్ తో చేతితో తయారుచేయబడిన కుషన్లను మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ అందరికి నచ్చేవిధంగా, మీ ఇంటి అందాన్ని పెంచేలా ప్రోడెక్ట్‌లను ఇవ్వడమే మా బ్రాండ్ ఉద్దేశ్యం. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే. త్వరపడండి’ అంటూ బిజినెస్ గురించి చెప్పుకొచ్చింది చందమామ. మొత్తానికి పెళ్లి కాగానే కాజల్ వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టేసింది.