ఆత్మీయుల కోసం కాజల్ స్పెషల్ ప్లాన్స్

ఆత్మీయుల కోసం కాజల్ స్పెషల్ ప్లాన్స్

Published on Nov 10, 2020 2:08 AM IST


దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే వివాహం చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని ముంబైలో వివాహమాడింది. ప్రస్తుతం ఈ జంట హామీమూన్లో ఉన్నారు. కరోనా కారణంగా కాజల్ అతి కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలోనే వివాహం చేసుకుంది. నిజానికి కాజల్ కు తెలుగు, తమిళ పరిశ్రమల్లో చాలామంది మిత్రులున్నారు. అంతా బాగుంటే అందరినీ ఆహ్వానించి తారల తళుకుబెళుకులు మధ్యన ఇంకా ఘనంగా వివాహం చేసుకునేది. కానీ కోవిడ్ దృష్ట్యా అది కుదరలేదు. ”

అందుకే పరిస్థితులు చక్కబడ్డాక భారీ రిసెప్షన్ ఏర్పాటుచేసి ఆత్మీయులందరినీ ఆహ్వానించాలని కాజల్ ప్లాన్ చేస్తోందట. తెలుగు పరిశ్రమలోని మిత్రుల కోసం హైదరాబాద్ నగరంలో, తమిళ స్నేహితుల కోసం చెన్నైలో వేరు వేరుగా రెండు రిసెప్షన్లు జరపాలని చూస్తోందట చందమామ. ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో చిరు చేస్తున్న ‘ఆచార్య’, కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాలున్నాయి.

తాజా వార్తలు