ప్రముఖల పేర్లలో కాజల్ అగర్వాల్ పేరు మరికాస్త ప్రత్యేకం. ఆమె అఫీషియల్ పేజ్ ఇప్పటికే 6 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించుకుని అభిమానులకు తన సినిమా మరియు వ్యక్తిగత విశేషాలను అందిస్తుంది. ఇప్పుడు తను ఏకంగా యండ్రాయిడ్ మరియు ఆపిల్ ఐ.ఓ.ఎస్ మొబైల్ వినియోగదారులకు ఒక యాప్ ను ప్రారంభించింది
ఈరోజుల్లో మొబైల్ మార్కెట్ చాలా వేగవంతమైన ప్రచార మాధ్యమం అని సెలబ్రిటీలు తెలుసుకున్నారు. ఇటీవలే మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమా తాలూకు విశేషాల కోసం ఒక యాప్ ను విడుదలచేశారు. ఈ మాధ్యమాన్ని త్వరలో మరికొంతమంది సెలబ్రిటీలు వాడుకుంటారు అనడం అతిశయోక్తి కాదు
అన్నట్టు కాజల్ నటించిన ‘జిల్లా’ జనవరి 10న మనముందుకు రానుంది. అంతేకాక రామ్ చరణ్ ‘ఎవడు’లో అతిధిపాత్ర పోషించింది