జిల్లా షూటింగ్ మొదలుపెట్టిన కాజల్

జిల్లా షూటింగ్ మొదలుపెట్టిన కాజల్

Published on Jun 13, 2013 5:20 AM IST

Kajal
తమిళ సినీ రంగంలో బిజీ అయిన కాజల్ ప్రస్తుతం ఏ తెలుగు సినిమాను అంగీకరించలేదు. ప్రస్తుతం ఆమె కార్తీ నటిస్తున్న ‘ఆల్ ఇన్ ఆల్ అజ్హగురాజ’ మరియు విజయ్, మోహన్ లాల్ నటిస్తున్న ‘జిల్లా’ సినిమాలలో నాయికగా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా విడుదలకానున్నాయి. క్రితం వారం ‘ఆల్ ఇన్ ఆల్ అజ్హగురాజ’ ముఖ్య షెడ్యూల్ ముగించుకుని ఈ భామ తాన ఫ్యామిలీతో కలిసి కాస్త విరామం తీసుకుంది. ఈ రోజునుండి ‘జిల్లా’ షూటింగ్లో పాల్గుంటుంది

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుపుకుంటుంది. గతయేడాది కాజల్, విజయ్ జంటగా నటించి మురగదాస్ తీసిన ‘తుపాకి’ ఘనవిజయం సాదించింది. సమాచారం ప్రకారం కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో ఎలా నటించాలి అనే విషయంపై ఈ భామ మోహన్ లాల్ దగ్గర శిక్షణ తీసుకుంటుంది. ఆర్.బి చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాకు నేసన్ దర్శకుడు. డి ఇమ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు

తాజా వార్తలు