రావణ్ తరువాత మణిరత్నం చేస్తున్న సినిమా ‘కడల్’. ఇదే సినిమాని తెలుగులో ‘కడలి’ పేరుతో అనువదిస్తున్నారు. సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్, సీనియర్ హీరోయిన్ రాధ కూతురు తులసి ఇద్దరినీ పరిచయం చేస్తూ కడలి తెరకెక్కింది. సీనియర్ అరవింద్ స్వామి చాలా రోజుల తరువాత ఈ సినిమాలో నటిస్తున్నాడు. లక్ష్మి మంచు కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న కడలి ఆడియో వేడుక డిసెంబర్ 21న జరగనుంది. కడల్ (తమిళ్) ఆడియో డిసెంబర్ 17న విడుదల కానుంది. కడలి జనవరిలో విడుదల కానుంది.