ఆగస్ట్ 20న మొదలు కానున్న కాళిచరణ్

ఆగస్ట్ 20న మొదలు కానున్న కాళిచరణ్

Published on Aug 19, 2012 9:05 AM IST

ఈ మధ్య కాలంలో క్రైం కామెడీ కలగలిపిన చిత్రాలు చాలానే వస్తున్నాయి. అందులో “దోపిడీ”,”ట్విస్ట్”, “స్వామి రా రా” లాంటి చిత్రాలను ఇప్పటికే ప్రకటించారు. ఇది కాకుండా క్రైం ప్రధానాంశంగా సాగే “దళం” చిత్రం కూడా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది . తాజా సమాచారం ప్రకారం ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించనున్న “కాళిచరణ్ ” సినిమా కూడా ఈ లిస్టులో చేరింది. గతంలో “గాయం-2” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీణ్ శ్రీ ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో “వెన్నెల 1 1 /2″లో కనిపించనున్న చైతన్య కృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. చాందిని ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం ఆగస్ట్ 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలు కానుంది ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నిర్మాతలు హాజరు కానున్నారు. నందన్ రాజ్ సంగీతం అందించిన ఒక పాటను ఈ కార్యక్రమంలో విడుదల చేయ్యనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ కరుణాలయం బ్యానర్ మీద ప్రవీణ్ శ్రీ స్వయంగా నిర్మించనున్నారు.

తాజా వార్తలు