ఓటిటి సమీక్ష: ‘ప్రేమంటే ఇది కదా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘ప్రేమంటే ఇది కదా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Jun 15, 2025 10:50 PM IST

స్ట్రీమింగ్‌ తేదీ : జూన్ 15, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సాయి తేజ గోన, తనూజ మధురపంతుల, రమేష్ కోనంభొట్ల
దర్శకత్వం : సాయి తేజ గోన
నిర్మాత : కె రాఘవేంద్రరావు బి.ఎ
సంగీతం : DR. జోస్య భట్ల
సినిమాటోగ్రఫీ : వివేక్ వి లెక్కల
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు ప్రస్తుతం తీసుకొస్తున్న వీక్లీ సిరీస్ కథా సుధలో లేటెస్ట్ ఎపిసోడ్ నే “ప్రేమంటే ఇది కదా”. సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు బి ఏ పర్యవేక్షణలో తెరకెక్కించిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యుగులు విజయ్ (సాయి తేజ గోన) కవిత (తనూజ మధురాపంతుల) ఒకే దగ్గర వర్క్ చేస్తారు. అయితే కవితని ఎప్పుడు నుంచో ప్రేమిస్తూ ఓరోజు ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె కొన్ని టెస్ట్ లు పెట్టి అతన్ని ఓకే చేస్తుంది కానీ ఒకరోజు ఆమె ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి బ్రేకప్ చెబుతుంది. మరి ఈ కథని అంతా ఓ రోజు వాకింగ్ లో పరిచయం అయ్యిన ఓ వ్యక్తికి (?) చెప్పుకొని విజయ్ బాధపడతాడు. మరి విడిపోయిన ఈ ప్రేమికులు మళ్ళీ కలిసారా లేదా? ఒకవేళ కలిస్తే ఎలా కలిశారు? అందుకు అనుకూలించిన పరిస్థితులు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో వచ్చిన కొంచెం కూల్ కంటెంట్ తో కూడిన ఎపిసోడ్ ఇది అని చెప్పవచ్చు మొదటి నిమిషం నుంచే కొంచెం రిఫ్రెషింగ్ మూమెంట్స్ తో డీసెంట్ గా సాగుతుంది. ముఖ్యంగా లీడ్ నటీనటుల మధ్య మాటలు కొన్ని పరిస్థితులు బాగుంటాయి.

అలా వారి నడుమ సాగే లవ్ ట్రాక్ ఇంప్రెస్ చేస్తుంది. అలాగే వారి పాత్రల్లో సాయి తేజ కూల్ లుక్స్ లో మెచ్యూర్ నటనతో, క్లీన్ డైలాగ్ డెలివరీతో మంచి పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే తనూజ కూడా తన పక్కన బానే ఉంది. కొన్ని సీన్స్ లో కెమిస్ట్రీ పర్వాలేదు. అలాగే ఎండింగ్ కూడా నైస్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ ఒకింత బాగానే సాగినప్పటికీ మధ్యలో ఎక్కడో కొంచెం రొటీన్ భావన కలుగుతుంది. బాగా క్లారిటీగా ఉండే కథానాయకి పాత్ర ఆమె బ్యాక్ స్టోరీ ఓకే కానీ ఆమె తండ్రి పాత్ర మాత్రం అంత బలంగా కనిపించలేదు. ఆమె చెప్పిన దానికి ఎపిసోడ్ లో అతని పాత్రని చూసిన దానికి పొంతన కనిపించదు.

అలాగే ఇంకొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా తీర్చిదిద్ది ఉంటే ఆ ఎమోషన్స్ మరింత బాగా అనిపించేవి. అలాగే కొన్ని నిమిషాల తర్వాతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది సగటు వీక్షకుడు ముందే ఊహించేస్తాడు. సో ఈ అంశాలు కొంచెం బలహీనంగా అనిపిస్తాయి. అలాగే ఫీమేల్ లీడ్ నటి కొన్ని సీన్స్ లో నటన బాలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్ లో అంత సహజత్వం కనిపించలేదు.

సాంకేతిక వర్గం:

ఈ ఎపిసోడ్ తాలూకా నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం ప్రెజెంట్ గా ఉంది, బిట్ సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. డైలాగ్స్ మంచి అర్ధవంతంగా ఆలోచించేలా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బానే ఉంది.

ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ లోనే నటించిన సాయి తేజ గోన దర్శకత్వం కూడా వహించారు. రాఘవేంద్రరావు బి ఏ అనుభవంతో తన దర్శకత్వం ఈ ఎపిసోడ్ లో బానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్ గా కొన్ని సీన్స్ ని ఆవిష్కరించాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘ప్రేమంటే ఇది కదా’ లో లవ్ యాంగిల్ వరకు సన్నివేశాలు బాగున్నాయి. కొంచెం కూల్ అండ్ డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే లీడ్ నటీనటులు కూడా బాగానే చేశారు. కాకపోతే కొన్ని అంశాలు రొటీన్ గానే అనిపిస్తాయి. సో ఇలా ఉన్నా పర్లేదు. కొంచెం డీసెంట్ లవ్ ట్రాక్, అది కూడా అక్కడక్కడా మంచి డైలాగ్స్, మూమెంట్స్ తో చూడాలి అనుకుంటే ఈ ఎపిసోడ్ ని ఒకసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు