భారత్ ప్రసిద్ద బాడ్ మింటన్ చాంపియన్ జ్వాలా గుత్తా నితిన్ హీరోగా నటిస్తున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోందని ఇదివరకే తెలిపాము. ఈ సాంగ్ షూటింగ్ ఈ రోజుటితో పూర్తయ్యింది. ‘ జ్వాలాతో చేస్తున్న స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇప్పుడే పూర్తయ్యింది. షూటింగ్ ఫన్నీగా గడిచిందని’ నితిన్ ట్వీట్ చేసాడు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ డైరెక్టర్. నితిన్ – నిత్యా కలిసి నటించిన ‘ఇష్క్ సినిమాతో 2012 లో హిట్ అందుకున్నారు. ఆ సినిమాని నిర్మించిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ వారే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.