బ్యాడ్మింటన్ ప్లేయర్ గా గుత్తా జ్వాలకి పాపులారిటీ బాగానే ఉంది. అయితే గత కొన్నాళ్లుగా జ్వాల తన గేమ్ కంటే కూడా తన కామెంట్లతోనే న్యూస్ లో హాట్ టాపిక్ అవుతుంది. తమిళ యాక్టర్ విష్ణు విశాల్ తో కొన్నాళ్లుగా గుత్తా జ్వాల డేటింగ్ లో ఉందని ఆ మధ్య వార్తలు వచ్చినా అందరూ నమ్మలేదు. కారణం జ్వాల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయిందనుకోండి. ఇక ఇటు హీరో విష్ణు విశాల్ కు గత జూన్ లో రజనీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. కానీ వీళ్లు కూడా విడిపోయారట. మొత్తానికి ఇద్దరూ తమ భాగస్వామ్యులను వదిలి.. ఒక్కటయ్యారు అన్నమాట. ఇంతకీ వీరు ఒక్కటయ్యారని జనం నమ్మేవిధంగా గుత్తా జ్వాలనే తాజాగా స్టేట్మెంట్ ఇచ్చింది.
గతంలోనే కొత్త సంవత్సర వేడుకల్లో గుత్తా జ్వాల – విష్ణు విశాల్ జంట కలిసి ఫోటోలు తీసుకున్నారు. విశాల్ విష్ణు తనను ముద్దాడుతున్న ఫోటోను జ్వాలనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పుడే వీరి బంధం పై క్లారిటీ వచ్చింది. తాజాగా జ్వాల కూడా నిజమే అని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి గుత్తా జ్వాల, విష్ణు విశాల్ తో తానూ నడుపుతున్న రహస్య ఎఫైర్ ను బహిరంగం చేసేసింది, అయితే ఈ బంధం నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జ్వాల ప్రస్తుతం హీరోగారితో డేటింగ్ లో ఉంది కాబట్టి, ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోదు అనుకోండి.