స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ చిత్రం ఆగష్టుకి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదల చేయనున్నారు, ఇది అధికారిక సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు మరియు మళయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. గోవా బ్యూటీ ఇలియానా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు.
ఈ చిత్రంలో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పోలిస్ పాత్రలో కనిపించనున్నారు మరియు సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. డి.వి.వి దానయ్య సమర్పణలో ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జులాయి’ మరియు ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాలు వాయిదా పడడంతో ‘ఈగ’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వరదని కొనసాగించనుంది.