డబుల్ ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకున్న ‘జులాయి’

డబుల్ ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకున్న ‘జులాయి’

Published on Aug 18, 2012 1:45 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి చిత్ర డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్లోని తాజ్ బంజారాలో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు మరియు దేవీ శ్రీ ప్రసాద్ లు హాజరయ్యారు. అందరూ ఈ చిత్రం ఇంతటి విజయాన్ని సాదించినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు మరియు ఎంతో ఎంటర్టైనింగ్ గా సినిమాని తెరకెక్కించినందుకు త్రివిక్రమ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ కెరీర్లోనే ‘జులాయి’ బ్లాక్ బస్టర్ చిత్రమని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర ఆడియో మంచి విజయం సాదించినందుకు ఈ చిత్ర టీం అంతా దేవీ శ్రీ ని మెచ్చుకున్నారు. ఈ కార్య క్రమానికి వచ్చిన అతిధుల మీద బ్రహ్మానందం పంచ్ డైలాగులు విసురుతూ మరియు సెటైర్స్ వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసారు.

తాజా వార్తలు