‘జులాయి’ నైజాం కలెక్షన్స్ రిపోర్ట్

‘జులాయి’ నైజాం కలెక్షన్స్ రిపోర్ట్

Published on Aug 22, 2012 5:06 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం నైజాంలో మంచి వసూళ్లను సాదిస్తోంది. ఈ చిత్రం మొత్తం 13 రోజుల్లో ఒక్క నైజాంలోనే 9.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుండడంతో ఈ వారాంతం వరకూ ఈ చిత్ర కలెక్షన్లకు ఎలాంటి డోఖా ఉండదు.

అల్లు అర్జున్ మరియు ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎ.సి.పి సీతారామ్ పాత్రలో కనిపించగా, సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపించారు. డి.వి.వి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ కలెక్షన్లు చూసి ‘జులాయి’ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా వార్తలు