అభిమానితో ఎన్టీఆర్ వీడియో కాల్.. మాట కూడ ఇచ్చారు

అభిమానితో ఎన్టీఆర్ వీడియో కాల్.. మాట కూడ ఇచ్చారు

Published on Nov 3, 2020 9:08 PM IST

యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అభిమానులంటే ప్రత్యేక శ్రద్ద. ఎప్పుడూ వారు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తుంటారు. తన ఆడియో ఫంక్షన్లు జరిగినప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని పదే పదే చెబుతుంటారు. అంతేకాదు తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే వెంటనే స్పందిస్తారు. తాజాగా తన వీరాభిమాని వెంకన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తనను కలవడానికి ఎదురుచూస్తున్నాడని తెలుసుకున్న తారక్ వెంటనే అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.

వెంకన్న నాకు మీతో సెల్ఫీ దిగాలని ఉందన్నా అని అడగ్గానే తారక్ ఈ కరోనా గొడవ తగ్గక ఖచ్చితంగా కలుద్దామని అన్నారు. ఇంతలో అభిమాని మిమ్మల్ని కలవడానికైనా బ్రతుకుతాను అనగానే నీకు ఏం కాదు, నాకు ఏం కాదు తప్పకుండా కలుస్తాను, మంచి ఫోటో దిగుదాం. నువ్వు మాత్రం బాగా తిని సంతోషంగా ఉంటూ అంటూ వెంకన్న తల్లికి తనకు వీలైన సహాయం తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. తారక్ నేరుగా ఫోన్ చేసి మరీ మాట్లాడటంతో వెంకన్న ఆనందానికి అవధులు లేవు. తారక్ చేసిన ఈ మంచి పని గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తాజా వార్తలు