ఎన్.టి.ఆర్ సినిమాలో నటకిరీటి నటించనున్నాడా?

ఎన్.టి.ఆర్ సినిమాలో నటకిరీటి నటించనున్నాడా?

Published on Aug 22, 2012 5:57 PM IST


1980 మరియు 1990 లలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకున్న హీరో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్. ఇప్పటికీ ఆయన ఎలాంటి విరామం లేకుండా హీరోగా తన వయసుకు తగిన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంతే కాకుండా పెద్ద హీరోల సినిమాల్లో ప్రముఖ పాత్రలను చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘బావ’, ‘మొగుడు’ మరియు ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన ‘జులాయి’ చిత్రాలు ఆ కోవలోకే వస్తాయి. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో రానున్న చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాద్షా’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ చిత్ర పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు