ఓటిటి సమీక్ష: ‘థాంక్ యూ నాన్న’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘థాంక్ యూ నాన్న’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Aug 4, 2025 9:59 AM IST

Thank-You-Nanna

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఆగస్ట్ 3, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : జయ ప్రకాష్, అనుమిత దత్త, శ్రీధర్, గణేష్, మృదుల తదితరులు
దర్శకత్వం : జై ప్రకాష్
నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
ఛాయాగ్రహణం : పసుపులేటి రామకృష్ణ
సంగీతం : జోశ్య భట్ల
కూర్పు : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రతీ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ తీసుకొస్తున్న కథాసుధ వీక్లీ ఎపిసోడ్స్ లో ఈ వారం వచ్చిన లఘు చిత్రమే ‘థాంక్ యూ నాన్న’. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలోకి తెలుసుకుందాం.

కథ:

ఒక సాధారణ క్లర్క్ అయినటువంటి సాయి చంద్ (జయ ప్రకాష్) తన భార్య చనిపోయాక తన ముగ్గురు పిల్లలని అన్నీ తానే తన వర్క్ ని కూడా బ్యాలన్స్ చేసుకుంటూ సాకుతాడు. ఇలా తన కూతురు అంజలి (అనుమిత దత్త) పెద్దయ్యాక పెళ్లి సంబంధం కుదిర్చి నిశ్చయ తాంబూలాలు సమయంలో ఊహించని విధంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. తన కొడుకులు ప్రదీప్, సదీర్ ఈ సమయంలో ఏం చేశారు? తాను ఎంతగానో ప్రేమించిన వాడిని కాదనుకొని అంజలి ఏం చేస్తుంది? చివరికి సాయి బ్రతికారా లేదా? అంజలి పెళ్లి అయ్యిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో బాగా అనిపించే అంశం ఏదన్నా ఉంది అంటే నడిచే కథనం అందులోని లోతుని దర్శకుడు బాగా బ్యాలన్స్ చేశారు. కొన్ని మూమెంట్స్ సింపుల్ గానే ఉన్నప్పటికీ రాసుకున్న సన్నివేశాలు ఎమోషనల్ గా చూపించిన విధానం ఈ ఎపిసోడ్ లో మాత్రం హత్తుకునేలా ఉంటుంది. ముఖ్యంగా నటుడు జయప్రకాష్ తన రోల్ లో చాలా బాగా చేశారు.

బాధ్యత గల తండ్రిగా తన పిల్లలని ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిగా తాను పడిన తపన, పడ్డ స్ట్రగుల్స్ విషయంలో చాలా బాగా చేశారు. అలాగే తనపై కొన్ని సీన్స్ ఎమోషనల్ గా చాలా మందికి కనెక్ట్ అవుతాయి. అలాగే లీడ్ జంట అనుమిత, శ్రీధర్ తమ పాత్రల్లో బాగా సూట్ అయ్యారు అంతే బాగా నటించారు. వారి నడుమ చిన్న లవ్ స్టోరీ వారి మధ్యలో జయ ప్రకాష్ సన్నివేశాలు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి.

ఇక ఈ ఎపిసోడ్ లో దర్శకుడు ఎమోషన్స్ ని ఒకింత హార్డ్ హిట్టింగ్ గానే చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని పచ్చి నిజాలు కూడా ప్రస్తుత తరం పిల్లల విషయంలో చూపించారు. అలాగే ఈ ఎపిసోడ్ లో సంగీతం మరింత వర్కౌట్ అయ్యింది అని చెప్పవచ్చు. మంచి ఎమోషనల్ గా అందించిన ట్యూన్స్ అండ్ స్కోర్ సన్నివేశాలకి మరింత ఇంపాక్ట్ అందించాయి.

మైనస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో లైన్ చాలా సింపుల్ గానే ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని చోట్ల కథనం చాలా సింపుల్ గానే ఊహాజనితంగానే అనిపిస్తుంది. సో మరీ కొత్తదనం ఆశించేవారు ఒకింత డిజప్పాయింట్ కావచ్చు. అలాగే మరికొన్ని సన్నివేశాలు ఒకింత డ్రమాటిక్ గా అనిపించే అవకాశం కూడా లేకపోలేదు. వీటితో ఈ ఎపిసోడ్ పై మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ ఎపిసోడ్ లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రతీ అంశంలో మేకర్స్ మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. ముఖ్యంగా జోశ్య భట్ల ఇచ్చిన సంగీతం మంచి ఇంపాక్ట్ కలిగించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా నీట్ గానే ఉన్నాయి. ఇక దర్శకుడు జై ప్రకాష్ విషయానికి వస్తే.. తాను ప్రస్తుత కాలంలో ఉన్న సోషల్ అండ్ ఎమోషనల్ పాయింట్ నే తీసుకున్నారు.

అలాగే తిమ్మర్ రెడ్డి కథ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ బాగా రాసుకున్నారు. నాన్న అనే ఎమోషన్ విషయంలో తాను తీసుకున్న కేర్ కానీ రాసుకున్న ఎమోషనల్ మూమెంట్స్ కానీ హత్తుకున్నాయి. అలాగే దర్శకుడు నటీనటులు నుంచి కూడా మంచి పెర్ఫామెన్స్ లు రాబట్టారు. కాకపోతే కొంచెం ఊహాజనిత కథనం ఉంది అలాగే కొన్ని సీన్స్ కొంచెం డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఇవి పక్కన పెడితే తన వర్క్ ఈ ఎపిసోడ్ కి బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘థాంక్ యూ నాన్న’ లఘు చిత్రం మంచి మ్యూజిక్ తో కూడుకున్న ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్స్ ని అది కూడా నాన్న సెంటిమెంట్ తో చూడాలి అనుకునేవారికి డీసెంట్ గా అనిపిస్తుంది. ప్రెజెంట్ జెనరేషన్ లో ఉన్న కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ని దర్శకుడు బాగా చూపించారు. కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం రెగ్యులర్ అండ్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎపిసోడ్ ని తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు