చాలా రోజుల సినిమాలు లేని కరువు తరువాత ఈ శుక్రవారం థియేటర్ లతో కళకళలాడనుంది. సమాచారం ప్రకారం ఈ వారాంతరంలో నాలుగు తెలుగు సినిమాలు విడుదలకానున్నాయి. అక్కినేని క్యాంపు నుండి సుశాంత్ హీరోగా ‘అడ్డా’ సినిమా విడుదలకానుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో సుశాంత్ సరసన షన్వి కనిపిస్తుంది
విలక్షణ దర్శకుడు తేజ తీసిన ‘1000 అబద్ధాలు’ సినిమాకూడా ఈరోజే విడుదలకానుంది. రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్, ఏస్తర్ హీరో హీరోయిన్స్. రమణ గోగుల సంగీతాన్ని అందించాడు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మంచి మార్కులను సంపాదించుకుంది
మరొకటి ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర మరియు పియా భాజ్ పై నటించిన ‘దళం’. రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జనజీవన స్రవంతిలో కలిసిన నక్సల్స్ నేపధ్యంలో తెరకెక్కింది
దైవత్వం నిడిన సినిమాలను ఇష్టపడేవారికి జె.కె భారవి దృశ్యకావ్యం ‘జగద్గురు ఆదిశంకర’ ఉండనేవుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, డా ఎం. మోహన్ బాబు ముఖ్యపాత్రలలో కనిపిస్తారు