గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2 – తాండవం’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘జాజికాయ జాజికాయ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ పాట ఆద్యంతం మాస్ బీట్తో హుషారెత్తించేలా ఉంది. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషల్ కలిసి పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ఇక ఈ పాటలో బాలయ్య మాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. ఆయన సరసన అందాల భామ సంయుక్త కూడా తన అందంతో అలరించింది.
ఈ పాట ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
