మేము మీకు ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని తెలియజేస్తున్నాం. బాలకృష్ణ సినిమాలో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది కన్ఫమ్. ఈ విషయాన్ని అధికారికంగా త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సాయి కొర్రపాటి సమర్పణలో 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జగపతి బాబు స్ట్రాంగ్ వాయిస్, కోపంలో కనిపించే అతని రూపం విలన్ గా బాగానే సెట్ అవుతాడని భావిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్రకి మంచి ప్రాదాన్యత లబించనుందని సమాచారం. దీనితో న్యూ కెరీర్ దిశగా జగపతి బాబు కెరీర్ వెళ్ళే అవకాశం వుంది. ఈ సినిమాలో తను ఎలా కనిపించనున్నాడో చూద్దాం.