జగపతిబాబు మరియు గాయత్రి ప్రధాన పాత్రలలో నటిస్తునన్ చిత్రం “6”. సోమవారం ఉదయం ఇక్కడ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇందులో ఉరవకొండ దగ్గర ఒక గ్రామంలో రోజు సాయంత్రం ఆరు దాటాక హత్యలు జరుగుతుంటాయి ఈ హత్యల వెనక ఉన్న రహస్యం ఏంటనేది చిత్రంలో చూడాల్సిందే” అని అన్నారు.శ్రీకాంత్ లింగోడ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు వైవిధ్యమయిన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర రీ-రికార్డింగ్ పనులను లాస్ ఏంజల్స్ లో పూర్తి చేశామని, త్వరలోనే పాటలను విడుదల చేస్తామని నిర్మాత కృష్ణ బోల్లమోని అన్నారు. ఈ చిత్రానికి రవి వర్మ సంగీతం అందించారు.