అలా మొదలైంది సినిమా తర్వాత క్లాస్ కపుల్ ని కాస్తా మాస్ గా మార్చి చేస్తున్న సినిమా ‘జబర్దస్త్’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఎస్.ఎస్ తమన్ ఇప్పటివరకూ అతను చేసిన సినిమాల నుంచి కొంచెం బయటకి వచ్చి చేసిన ఈ సినిమా ఆల్బమ్ కి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. సిద్దార్థ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, శ్రీ హరి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.