త్వరలోనే జబర్దస్త్ ఆడియో

త్వరలోనే జబర్దస్త్ ఆడియో

Published on Dec 30, 2012 8:46 PM IST

siddharth_samantha
సిద్దార్థ్, సమంత జంటగా, నిత్యా మీనన్ అతిధి పాత్రలో తెరకెక్కిన ‘జబర్దస్త్’ సినిమా 2013లో మొదట్లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ‘అలా మొదలైంది’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నందిని రెడ్డి చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ నెల మొదట్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ఫైనల్ మిక్స్ పూర్తఃయ్యింది. ‘ జబర్దస్త్ ఆల్బమ్ కి సంబంధించి అన్నీ పూర్తి చేసాను త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నాం. నందిని రెడ్డితో పని చేయడం చాలా సరదాగా ఉంది, నా వరకూ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చానని’ తమన్ ట్వీట్ చేసాడు. జనవరి మొదట్లో ఈ ఆడియో విడుడులయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో సమంత ముస్లీం అమ్మాయిలా కనిపించనుందని సమాచారం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో కవ్వలి పాట కూడా ఉంది.

తాజా వార్తలు