విజయ్ తో రొమాన్స్ కావాలంటున్న “జాతి రత్నాలు” బ్యూటీ.!

మన టాలీవుడ్ లో కొత్త టాలెంట్ కు ఎప్పుడూ కూడా కొత్త టాలెంట్ కు కొదవ ఉండదు. అలా తెలుగు సినిమాకు పరిచయం కాబడ్డ చాలా మంది యువ నటులు తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. మరి అలా కాస్త టైం పట్టినా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “జాతి రత్నాలు”.

మరి నవీన్ లానే తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీగా ఉన్న డెబ్యూ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఈ మార్చ్ 5న విడుదలకు రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలనే ఆమె పంచుకుంది. ఈమెది మన హైదరాబాదే అట అలాగే తాను లయోలా కాలేజ్ లో చదువుకుంటున్న టైం లో నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్ గా వచ్చినపుడు తనని చూసి ఆడిషన్ కు పిలవగా ఫైనల్ గా తనకి ఈ ఛాన్స్ వచ్చినట్టు తెలిపింది.

అంతే కాకుండా తాను మళయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కు పెద్ద ఫ్యాన్ ని అని కూడా చెప్పుకొచ్చింది. కానీ మన తెలుగులో అయితే రౌడీ హీరో విజయ్ తో రొమాన్స్ చేయాలనుంది తన మనసులో మాట చెప్పింది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బజ్ ఉంది. అలాగే నిర్మాత నాగ్ అశ్విన్ తన హీరో ప్రభాస్ తోనే ఏకంగా ట్రైలర్ లాంచ్ కు ప్లాన్ చేసాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version