బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాట్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ మూవీగా నిలిచింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం సన్నీ డియోల్‌ను బెస్ట్ ఫాంలో చూపించి తెలుగు దర్శకుడికి ప్రశంసలు అందించింది.
ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ, ‘జాట్ 2’ అనే సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్‌ను గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు.
‘డ్యూడ్’ ప్రమోషన్స్ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “గోపిచంద్ మలినేని అందుబాటులో ఉంటే ఆయనే దర్శకత్వం వహిస్తారు. లేకపోతే మరో దర్శకుడితో ముందుకు వెళ్తాం. రెండో భాగం నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి” అని తెలిపారు. ఈ సీక్వెల్‌లో మరింత మాస్, మరింత యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని వారు తెలిపారు.