తమిళ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ గా వస్తున్న జాను చిత్ర ట్రైలర్ నిన్న విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఈ ట్రైలర్ విడుదలైన రోజు వ్యవధిలోనే యూట్యూబ్ లో దాదాపు 2.5 మిలియన్ వ్యూస్ దాటివేసి 3 మిలియన్ వైపుగా దూసుకుపోతుంది. ఎప్పుడో విడిపోయి మళ్ళీ కలిసిన ఓ జంట మధ్య నడిచే సున్నితమైన ప్రేమ కథగా జాను చిత్రం తెరకెక్కింది. పాత్రలకు తగ్గట్టుగా సమంత, శర్వా నంద్ ల మెట్యూర్డ్ పరఫార్మెన్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంది. జాను మూవీ వచ్చే నెల 7న గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు.
ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ జాను చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. గోవింద్ వసంత్ అందించిన సాంగ్స్ ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకున్నాయి. శర్వానంద్ ఈ చిత్రంలో వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ పాత్ర చేస్తున్నారు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ మూవీలో ఓ కీలక రోల్ చేశారు.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి