ఇట్స్ ఆఫీషియల్..”ఆదిపురుష్”లో సీత ఈమెనే.!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ విజువల్ వండర్ “ఆదిపురుష్” కూడా ఒకటి. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సీతగా ఎవరు కనిపిస్తారా అని గత కొన్నాళ్లుగా మంచి సస్పెన్సు నడుస్తున్న సంగతి తెలిసిందే.

అనేక మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ బాలీవుడ్ వర్గాలు నుంచి కృతి సనన్ పేరు మాత్రమే వినిపించింది. ఇప్పుడు ఫైనల్ గా ఇదే కన్ఫర్మ్ అయ్యింది. స్వయంగా కృతి సనన్ నే ఈ సస్పెన్సు కు తెర దించుతూ తాను ఈ చిత్రాల్లో భాగం అన్నట్టుగా ప్రభాస్ మరియు దర్శకుడు ఓంరౌట్ తో కలిసి దిగిన ఫొటోస్ షేర్ చేసింది.

దీనితో ఈ అప్డేట్ పై ఒక అధికారిక క్లారిటీ వచ్చేసింది. అలాగే ఈ చిత్రంలో లక్ష్మణ పాత్రలో కూడా సన్నీ సింగ్ పేరు కొన్నాళ్ళు వినిపించిన సంగతి తెలిసిందే దానిని కూడా ఓంరౌత్ కన్ఫర్మ్ చేసారు. సో ఇక గాసిప్స్ అండ్ బజ్ న్యూస్ లకు చెక్ పడి ఈ భారీ చిత్రంలో సీతగా కృతి సనన్ కనిపించడం ఖరారు అయ్యింది. మరి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

Exit mobile version