హీరోయిన్ రష్మిక మందాన పై ఐ టి దాడులు..!

హీరోయిన్ రష్మిక మందాన పై ఐటీ దాడులు జరిగినట్టు సమాచారం.కర్ణాటక, కొడుగు జిల్లా విరాజ్‌పేటలోని రష్మిక నివాసం మరియు ఆఫీస్ పై నేటి ఉదయం 7:30 ప్రాంతంలో ఐటీ అధికారులు రైడ్స్ జరిపినట్టు తెలుస్తుంది. ఐతే ఈ విషయాన్ని రష్మిక మేనేజర్ ఖండించారు. రష్మిక తండ్రిగారైన మదన్ కి సంబంధించి వ్యాపారాలు, సంస్థలపై ఐటీ సోదాలు జరిగాయి అన్నారు. రష్మిక కు సంబంధించిన అకౌంట్స్ అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఐతే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న రష్మికపై ఐటీ దాడులు జరిగాయన్న వార్త సంచలనంగా మారింది.

మహేష్ కి జంటగా ఆమె నటించిన సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ వెంటపడే అల్లరి అమ్మాయిపాత్రలో రష్మిక నటించి మెప్పించింది. మహేష్ మేజర్ అజయ్ కృష్ణ రోల్ చేయగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర నిర్మించారు. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందించారు.

Exit mobile version