తమిళ్లో రీమేక్ కానున్న ‘ఇష్క్’


నితిన్ మరియు నిత్య మీనన్ జంటగా నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ‘ఇష్క్’ ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళ్లో రీమేక్ కానుంది. ఈ సినిమా ద్వారా సీనియర్ నటి జయప్రద చెల్లెలి కొడుకు సిద్ధార్థ్ ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. తెలుగులో కథానాయికగా నటించిన నిత్యా మీనన్ మీ తమిళ్లో కూడా నటింపజేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఆమె అంగీకరించకపోతే వేరే హీరొయిన్ ని తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ తమిళ్ రీమేక్ వెర్షన్ కి రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version