నిజాం లో నితిన్ కి ఉత్తమ చిత్రం “ఇష్క్”

నిజాం లో నితిన్ కి ఉత్తమ చిత్రం “ఇష్క్”

Published on Feb 29, 2012 8:30 AM IST


చాలా రోజుల తరువాత ఈ మధ్యనే విడుదలయిన “ఇష్క్” చిత్రం తో నిటి ఒక విజయం దక్కించుకున్నాడు . మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం నిజాం ప్రాంతం లో నితిన్ కి బాక్స్ ఆఫీసు వద్ద ఇదే అత్యుత్తమ చిత్రం అవుతుంది. విడుదలయిన వారం లో ఈ చిత్రం 1.3 కోట్లు వసూలు చేసింది. పరుగు మీద ఈ చిత్రం రెండు కోట్ల వరకు వసూలు చెయ్యవచ్చని సిని పండితులు చెబుతున్నారు. నితిన్ మరియు నిత్య లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించారు. ఫై.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రేష్ట మోవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు