నితిన్ సీడెడ్ కెరీర్లో ఆల్ టైం గ్రాసర్ నిలిచిన ఇష్క్

నితిన్ సీడెడ్ కెరీర్లో ఆల్ టైం గ్రాసర్ నిలిచిన ఇష్క్

Published on Feb 27, 2012 12:28 PM IST


నితిన్ మరియు నిత్యా మీనన్ జంటగా నటించిన ‘ఇష్క్’ చిత్రం గత వారం విడుదలై ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటుంది. నితిన్ కి చాలా రోజుల తరువాత మంచి హిట్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర సీడెడ్ పంపిణీ హక్కులు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు దక్కించుకోగా మొదటి మూడు రోజులకు గాను 27 లక్షల రూపాయల షేర్ దక్కించుకుంది. మొదటి వారంలో 50 లక్షల రూపాయల వరకు వసూలు చేయొచ్చు అని ఆశిస్తున్నారు. ఈ కలెక్షన్స్ నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ గా చెబుతున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ వారు నిర్మించగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు