అమితానందంలో ఉన్న ఇషా తల్వార్

అమితానందంలో ఉన్న ఇషా తల్వార్

Published on Apr 24, 2013 2:12 AM IST

Gunde Jaari Gallanthayyinde Press Meet (25)

‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో రెండో ముఖ్యపాత్ర చేసిన ఇషా తల్వార్ తన సినిమా హిట్ అవ్వడంతో చాలా ఆనందంగావుంది. నటీమణిగా తన ప్రయాణం గురించి మీడియాతో మాట్లాడుతూ “నేను ‘హమారా దిల్ ఆపకీ పాస్ హై’ సినిమాలో ఐశ్వర్య రాయ్ చెల్లెలిగా ఒక చిన్న పాత్రలో నటించాను. ఆ సినిమాకుడా హైదరాబాద్లో షూట్ చేయడంతో నాకూ ఈ నగరానికీ ప్రత్యేక అనుభందంవుంది. ముంబాయి సెయింట్ క్సేవియర్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసుకున్నాక సినిమాలలో రాకముందు కొన్ని కమర్షియల్ మ్యూజిక్ వీడియోలలో నటించాను. ఇందులో హ్రితిక్ రోషన్ తో కలిసి చేసినది కుడా ఒకటి వుంది. నా మొదటి తెలుగు చిత్రమే ఇంత పెద్ద విజయం సాదించడంతో చాలా ఆనందంగావుంది. చిత్రబృందంతో కలిసి హైదరాబాద్, దుబాయ్ లలో చిత్రీకరణ జరుపుకోవడం సంతోషంగావుందని”చెప్పింది.

పని పట్ల ఇషాకు వున్న తపనకు నితిన్ మెచ్చుకున్నాడు “తనకు పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేదని ఆమెకు తెలుసు. సెట్ లో తన తపన చూస్తే మాకు ముచ్చట వేసింది. డైలాగులు నేర్చుకోవడానికి చాలా కష్టపడింది. ఇషా ఒక మంచి డాన్సర్ కుడా. కాకపోతే ఈ సినిమాలో ఆ టాలెంట్ ను ప్రదర్శించే అవకాశం రాలేదు. ఈ సినిమా మంచి విజయం సాదించడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు తప్పక వస్తాయని”చెప్పాడు.

ఈమెను త్వరలో మేనెలలో విడుదలకాబోతున్న ‘తిళ్ళు ముళ్ళు’ అనే తమిళ సినిమాలో మనముందుకు రానుంది. ఈమె మరిన్ని స్క్రిప్ట్లు వినే పనిలో వుంది. “నేను ఇక్కడకు గ్లామర్ కోసం రాలేదు. మా నాన్నగారు 30ఏళ్ళగా సినీరంగంలో వున్నారు. ప్రస్తుతం బోనీకపూర్ తో కలిసి డిస్ట్రిబ్యూషన్ పనులు చూసుకుంటున్నారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ నచ్చితే ఏ భాష అయినా నాకు ఇబ్బందిలేదని “చెప్పింది.

తాజా వార్తలు